ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

Share Icons:

హైదరాబాద్, 6 సెప్టెంబర్:

తెలంగాణలో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే క్రమంలోనే ఈరోజు అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే…మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎన్నికలని ధీటుగా ఎదుర్కునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక అందులో భాగంగానే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కొద్దీసేపటి క్రితం రాజీనామా చేసి ఆ లేఖని స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో, అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. అసెంబ్లీ రద్దు కంటే ముందే తనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఇక ఆ తర్వాత పార్టీకి, పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రేవంత్ రెడ్డి ఆ లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపారు. అయితే ఆ లేఖ స్పీకర్‌కు అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ మరోసారి ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు.

మామాట: అంతా ముందస్తు ప్రభావం అనుకుంటా…!

Leave a Reply