పక్కా ప్లాన్ తో పంచాయితీ పోరుకు రేవంత్…

Share Icons:

కొడంగల్, 4 జనవరి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అసలు రెండేళ్ల పాటు తాను మీడియాతో మాట్లాడబోనని సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు.

అయితే తీసుకున్నఈ నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులుతో సహ అభిమానులు షాక్‌కి గురయ్యారు. కానీ ఇలా తను నిర్ణయం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండేళ్ల పాటు సమయం ఇచ్చి, ఆ తరువాత వారిని లక్ష్యంగా చేసుకోవచ్చనే రేవంత్ యోచిస్తున్నాడంటా.

అలాగే క్షేత్రస్థాయిలో మళ్లీ బలోపేతం అయ్యేందుకు మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే మరోసారి కిందిస్థాయి నుంచి కొడంగల్‌లో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం ఆయన పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మార్చుకుంటున్నారని, కొడంగల్ నియోజకవర్గంలోని పలు కీలక గ్రామ పంచాయతీల్లో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక సహా అనేక అంశాలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని తెలుస్తోంది. వీలైనంత వరకు అనేక పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపించుకోవాలని ఆయన వ్యూహరచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

మామాట: మరి పంచాయితీ ఎన్నికల్లో అయిన రేవంత్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి…

Leave a Reply