ఐకియాకి భూ కేటాయింపులపై రేవంత్ పిటిషన్…కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు

Share Icons:

హైదరాబాద్, 30 జనవరి:

రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పాన్ మక్తాలో అత్యంత విలువైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయమై ఐకియా సంస్థకు నామినేషన్ పద్దతిన నిబంధనలకు విరుద్దంగా ఈ భూమిని కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ చేసింది. 

అసలు ఈ భూములను ఐటీ సంస్థలకు కేటాయించాలని, కానీ భూమిని ఫర్నీచర్ షాప్‌కు కేటాయింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.33 కోట్లు మాత్రమే వచ్చాయని పిటిషనర్ వివరించారు. దీని వల్ల రూ.500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వచ్చిందని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో ఐకియా సంస్థ మరో 3.17 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రిజర్వ్ చేశారని  చెప్పారు.

ఇక ఈ విషయమై ఏ ప్రాతిపదికన ఈ భూములను కేటాయించారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ పిటిషన్ కోర్టులో ఎవరు దాఖలు చేశారనే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ పిటిషన్‌ను మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల తరపున చట్టసభల్లో తమ గొంతును విన్పించాలి, కానీ ఇలా కోర్టులకు ఎందుకు వస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మామాట: మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో

Leave a Reply