అవే రేవంత్ ఆయుధాలు కానున్నాయా….!

Share Icons:

హైదరాబాద్, 26 మార్చి:

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి…మల్కాజిగిరి లోక్‌సభ బరిలో దిగి పోరాడుతున్నారు. అందుకే ప్ర‌చారంలో కూడా రేవంత్ రెడ్డి వినూత్నంగా దూసుకుపోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో గెలెచేందుకు రేవంత్ ఓ సరికొత్త ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఇక టీఆర్ఎస్ తరుపున మల్కాజ్ గిరి మాజీ ఎంపీ, ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బరిలో వున్నారు.  రేవంత్ గులాబీ ప్రభుత్వ విధానాల‌పై స‌రి కొత్త అస్త్రాన్ని సంధించ‌బోతున్నారు. గత కొద్దిరోజులుగా ఏపీ డేటా విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓ చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. దీంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్న సమయంలో, ఇప్పుడు అదే అంశాన్ని ఎన్నికల ప్ర‌చారంలో అస్త్రాంగా వాడుకోవాల‌ని రేవంత్ చూస్తున్నారు.

అదే సమయంలో ముఖ్యంగా సీమాంధ్రులు ఎక్కువ ఉన్న ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ లాంటి నియోజకవర్గాలన్నీ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంటాయి. పైగా ఏపీ రాజకీయాల ప్రభావం హైదరాబాద్‌పై పడుతోంది. సీమాంధ్రకు చెందిన ఆస్తులున్న వారిని బెదిరించి.. వైసీపీకి మద్దతుదారులుగా మారాలన్న హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే తన పరిధిలోని సీమాంధ్ర ఓట్లన్నీ తనకే వెయ్యాలని రేవంత్ కోరుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఇక్కడ ఉన్న తెదేపా మద్ధతుదారులని తనవైపు తిప్పుకుంటున్నారు. ఇక ఇక్కడ జనసేన పోటీలో ఉన్న..ఇటీవల రేవంత్..పవన్‌తో కలిసి మంచి రాజకీయాలు చేస్తామని పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడ ఉన్న పవన్ అభిమానులు, కాపు ఓటర్లు రేవంత్ వైపు రావోచ్చు. అలాగే ఇక్కడ ఉన్న వైసీపీ మద్ధతుదారులు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి సపోర్ట్ చేశారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో రేవంత్‌కి మంచి పేరుంది. దీంతో వారు కూడా ఎక్కువ శాతం ఇటు వైపే రావోచ్చు. ఇక ఎలాగో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రేవంత్‌కి మద్ధతు ఉంటుంది. ఇన్ని రకాలుగా రేవంత్ వ్యూహాలు రచిస్తూ గెలుపు దిశగా వెళ్లాలని అనుకుంటున్నారు.

మామాట: మరి రేవంత్ వ్యూహాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి…

Leave a Reply