తెలంగాణలో ఎంత బలుపు పాలన సాగుతుందో అర్ధమవుతుంది…

Share Icons:

హైదరాబాద్, 2 మే:

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.  తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా ఈరోజు యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు గాంధీ భవన్ వద్ద చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు రేవంత్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.

విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతుంటే, కుర్రకుంక(కేటీఆర్) ఆయన్ను బఫూన్‌ అంటున్నారని మండిపడ్డారు. అసలు దీన్నిబట్టి తెలంగాణలో ఎంత బలుపు పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఇక 20 ఏళ్లుగా పరీక్షను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్, తన స్నేహితుల సంస్థ గ్లోబరీనాకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు. తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇంతవరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

మామాట: రేవంత్ ఏ మాత్రం తగ్గేలా లేడుగా…

Leave a Reply