రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించాలి

Share Icons:

నల్గొండ, 30 ఆగష్టు:

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించాలని ప్రజలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం మాల్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్  సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నారని, ప్రగతి నివేదన సభకు రూ.200 కోట్లు ఖర్చుపెట్టి… ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

మా అధిష్టానం ఢిల్లీలో ఉంది…కేసీఆర్‌ అధిష్టానం మోదీ కూడా ఢిల్లీలోనే ఉన్నారని, టీఆర్‌ఎస్‌ బీజేపీకి అనుబంధ శాఖగా కొనసాగుతుందని విమర్శించారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. కొత్తోళ్లకు టిక్కెట్లు ఇస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడగొడతారని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఓడగొట్టే పరిస్థితి టీఆర్‌ఎస్‌లో ఉందన్నారు. ఇక అమరుల త్యాగాలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కేసీఆర్.. వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.

మామాట: మరి ప్రజలు ఎవరిని ఓడిస్తారో చూడాలి..

Leave a Reply