అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటాం…

Revanthreddy fires on kcr and harishrao
Share Icons:

హైదరాబాద్, 12 సెప్టెంబర్:

2001 నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సహా 13 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

కేసీఆర్ తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని, తనకు ప్రత్యామ్నాయంగా ఉన్నవారిని కేసులతో భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

ఒక సామాజిక వర్గమే కేసీఆర్ అసలు టార్గెట్ అని, వారిపై కేసులతో దాడి చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇక జగ్గారెడ్డి కంటే ముందు తనని టార్గెట్ చేశారని, గండ్ర వెంకట రమణ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కీలక నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అష్టదిగ్బంధం చేస్తున్నారని, ఈ కేసులకు భయపడేది లేదని… చర్లపల్లి జైలులో 40 రోజులు ఉన్నానని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటామని, కేసీఆర్ మాట వింటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని, అధికారుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నామని రేవంత్ హెచ్చరించారు.

మామాట: ఈ కేసులు కేసీఆర్ కక్ష సాధింపు చర్యలేనా….

Leave a Reply