బుర్రలేని వారు నేను బీజేపీలో చేరతానని ప్రచారం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Share Icons:

తిరుపతి:

 

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ కమలంలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలనీ తమ పార్టీలో చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలో చేరగా…మరికొందరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ ఎంపీగా ఇటీవల పార్లమెంటులో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి తాజాగా బీజేపీలో చేరనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తాచాటారు. అయితే ఇటీవల రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలయ్యింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిపించారని, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉంటే ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సొమారపు సత్యనారాయణ నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో త్వరలో ఊహించని పరిణామాలు ఉంటాయని, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో బిజెపి లో చేరబోతున్నారని తెలిపారు.

 

తెలంగాణలో ప్రజలు కోరుకున్న పాలన జరగడం లేదని మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని… ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీలు అన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా గట్టిపోటీని ఇచ్చేందుకు బిజెపి సిద్ధంగా ఉందని… ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఉంటుందని ఎంపీలు తెలిపారు.

 

ఇక ఈ సందర్బంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు బీజేపీ నేతలు ఓ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఆయనకు సోకుగా ఉంటే.. ఇప్పుడే ఆ పదవి తీసుకోవాలని సూచించారు. తర్వాత వారికి ఆ అవకాశం ఉండదని అన్నారు.

Leave a Reply