రేవ్ పార్టీ గలగలలు

Share Icons:

విజయవాడ, సెప్టెంబర్ 08,

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో రేవ్ పార్టీ కలకలం చెలరేగింది. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి దేవరాతిగూడెంలోని ఓ రెస్టారెంట్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడిచేశారు. నిర్వాహకుడు సహా 28 మందిని అదుపులోకి తీసుకున్నారు.

దేవరాతిగూడెంలోని ఏ1 రెస్టారెంట్ లో మద్యంతో పాటు డ్రగ్స్ సేవిస్తూ మహిళలతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్నఅధికారులు 20 మంది పురుషులు, అసభ్య నృత్యాలు చేస్తున్న ఏడుగురు మహిళలతో పాటు రెస్టారెంట్ నిర్వహకుడు రమణ మహర్షిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు కార్లతో పాటు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మామాట:  అన్నిటికీ అనుమతిస్తున్నారుగా, దీనికీ ఇచ్చేయండి

Leave a Reply