ప్రజాధనం వృధా- పాలకుల బాధ్యత

Share Icons:

తిరుపతి,నవంబర్ 19,

[pinpoll id=”65321″]

అధికారంలో ఉన్నావారు పరిపాలనపై దృష్టిపెట్టకుండా, నిత్యం రాజకీయ ఎత్తుగడలు, కార్యకలాపాలు సాగిస్తుంటే ప్రజాసంక్షేమం ఎలా సమకూరుతుంది.?  పాలకులు ప్రచారానికి, ఆర్బాటానికి, భవిష్యత్తు సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా దుందుడుకు చర్యలకు పాల్పడితే వృధా అయ్యే ప్రజాధానానికి పూచీ ఎవ్వరు.  ఇవన్నీ అర్థం లేని అనుమానాలేనా.  వాస్తవం లేదా. ఉదాహరణకు నిన్న విజయవాడలో జరిగిన ఎఫ్ 1హెచ్2వో  పోటీలు, వాటి నిర్వహణ తీరులో అధికార దర్పం కనిపిస్తోంది కానీ, ప్రజాసంక్షేమం కనిపిస్తోందా.? ఇటువంటి క్రీడలకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందా. రాష్ట్రంలో ఈ క్రీడను స్వీకరిచే ఆర్థిక స్తోమత ఎందరికి ఉంది. అటువంటి వాటిని తూతూమంత్రంగా నిర్వహించారు సరే. 2019 లో ఇది మళ్లీ సాధ్యం అవుతుందా. అపుడు ఇదే పార్టీ అధికారంలో ఉంటుందా. అసలు ఆ నదిలో నీరు అందుబాటులో ఉంటుందా, ఆనకట్టల లో నిలువ  ఉండే నీటిలో ఇటువంటి పోటీలు నిర్వహించ వచ్చునా, తరువాత ఆ నీటిని తాగడానికి వినియోగించ వచ్చునా, శుద్దిచేసినా సరే. వీటన్నిటికీ సమాధానాలు అడగడం ప్రజలుగా మనహక్కు.. బదులుచెప్పడం పాలకుల బాధ్యత. మీరేమంటారు.

మామాట: ఇవన్నీ ప్రజాధనం పాలకుల అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమాలుగా భావించాలి.

Leave a Reply