అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తో మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ ఎస్‌యూవీ డస్టర్‌

renault svu duster updated version released in india
Share Icons:

ముంబై:

 

ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్ తన ఎస్‌యూవీ డస్టర్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ని భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 8లక్షల నుంచి రూ. 12.5లక్షల వరకు ఉండనుంది. ఈ వెర్షన్‌ డస్టర్‌లో యాపిల్‌ కార్‌ప్లే, వాయిస్‌ రికగ్నిషన్‌తో ఆండ్రాయిడ్‌ ఆటో ఇన్ఫోటెయిన్‌మెంట్‌, ఎకోగైడ్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ సహా 25 అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

 

అలాగే పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది. ఈ నెల అంతటా క్యాప్చర్, క్విడ్ మోడల్ కార్ల రీప్లేస్‌మెంట్‌పై డిస్కౌంట్లు అందజేయనున్నట్లు రెనాల్ట్ తెలిపింది. ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ 17.64 సెం.మీ. టచ్ స్క్రీన్ మీడియా నావ్ ఎవల్యూషన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. కాస్పయిన్ బ్లూ, మహోగనీ బ్రౌన్ రంగుల్లో లభ్యం కానున్నది.

 

ఇక అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రెనాల్ట్, భారతదేశ విపణిలో ప్రవేశపెట్టిన అప్ డేటెడ్ డస్టర్ కారును దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. న్యూ ట్రై వింగ్డ్ ఫుల్ క్రోమ్ గ్రిల్లె, న్యూ డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, మస్క్యులర్ స్కిడ్ ప్లేట్స్, న్యూ సిగ్నేచర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తదితర ఫీచర్లు అనుసంధానించారు.

Leave a Reply