జియో డబుల్ ధమాకా…మిగతా నెట్‌వర్క్‌లకు దిమ్మతిరగడం ఖాయం…

Reliance Jio gave a data double offer
Share Icons:

ముంబై, 13 జూన్:

భారత్ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో సంస్థ మిగతా టెలికాం సంస్థలకు దిమ్మ తిరిగేలా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తన ప్రీపెయిడ్‌ కస్టమర్లని ఆకట్టుకునేందుకు డేటా డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

ఇప్పటికే అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఇస్తున్న జియో ఇప్పుడు తన అన్నీ ప్లాన్స్‌పై 1.5 జీబీ అదనపు రోజువారీ డేటాను ఇవ్వనుంది.

ఆ ప్ర‌కారం.. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భించగా ఇక‌పై రోజుకు 3 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా వ‌స్తుండ‌గా ఇక‌పై రోజుకు 3.5 జీబీ డేటా ల‌భిస్తుంది.

అదే విధంగా రూ.299 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటాకు బ‌దులుగా 4.5 జీబీ డేటా, రూ.509 ప్లాన్‌లో రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799 ప్లాన్‌లో రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ఆఫర్లన్నీ ఈ రోజు సాయంత్రం యాక్టివేట్ కానుండ‌గా, ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి.

ఇక దీంతో పాటు జియో రూ.300కి పైగా రీఛార్జి చేసుకున్న వినియోగదారులకు 20శాతం డిస్కౌంట్‌ను అంటే సుమారు రూ. 100 వరకు తగ్గింపు ఇవ్వనుంది. అయితే.. ఈ రీఛార్జిలు మై జియో యాప్‌, ఫోన్‌పే వ్యాలెట్‌ ద్వారా చేసుకుంటే మాత్రమే ఇది వర్తిస్తుంది.

మామాట: దిమ్మతిరిగే ఆఫరే ఇచ్చింది…

Leave a Reply