ఎయిర్ టెల్, వోడాఫోన్ – ఐడియాలు జియో బాటలో వెళ్లనున్నాయా?

Airtel, Voda Idea cut ringer timing to 25 seconds to match Jio
Share Icons:

ముంబై: భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాయిస్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో నిమిషానికి 6 పైసలు చార్జీ వసూలు చేస్తామని పేర్కొంది. అయితే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఐయూసీ చార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది. అయితే 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని తెలిపింది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండదు.

ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్‌ అప్స్‌) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. దీంతో 35 కోట్ల మంది జియో యూజర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు కూడా అఫ్‌–నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి  6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది.

కొత్త ఐయూసీ ప్లాన్లు..

 రూ. 10 ప్లాన్‌: 124 నిమిషాలు. 1 జీబీ డేటా.
రూ. 20 ప్లాన్‌: 249 నిమిషాలు. 2 జీబీ డేటా.
రూ. 50 ప్లాన్‌: 656 నిమిషాలు. 5 జీబీ డేటా.
రూ. 100 ప్లాన్‌: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా.

ఇదిలా ఉంటే జియో నిర్ణయం ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపించింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభంకాగానే, బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప నష్టాల్లోకి జారుకోగా, టెలికం కంపెనీల ఈక్విటీలు మాత్రం భారీగా లాభపడ్డాయి. జియో దారిలోనే ఎయిర్ టెల్ కూడా పయనిస్తుందన్న అంచనాలతో ఆ సంస్థ ఈక్విటీ ఏకంగా 6 శాతం పెరిగింది. ఇక వోడాఫోన్ ఐడియా ఏకంగా 15 శాతం లాభపడింది.

జియో మాదిరిగానే మిగతా అన్ని కంపెనీలు కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ పై చార్జీలను విధిస్తారని మార్కెట్ వర్గాలు నమ్మాయని, దీంతో ఇప్పటివరకూ నష్టాల్లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు కొంతమేరకు కోలుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఈ కారణంతోనే ఆయా కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు వచ్చిందన్నారు.

 

Leave a Reply