ఎస్‌బి‌ఐ మినిమం బ్యాలెన్స్‌పై ఛార్జీలు తగ్గింపు

ఎస్‌బి‌ఐ మినిమం బ్యాలెన్స్‌పై ఛార్జీలు తగ్గింపు
Views:
50

ముంబయి, 13 మార్చి:

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.

తమ ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్‌బీఐ అంతక ముందు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా వినియోగదారులకు ఊరటని కలిగిస్తూ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లేకపోతే విధించే చార్జీలను బ్యాంకు 75 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ చార్జీలు రూ.50గా ఉండగా, ఇకపై రూ.15గా అమలవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. కనీస నిల్వలో 75 శాతానికి పైగా లేకపోతేనే ఈ చార్జీ వర్తిస్తుంది. ఒకవేళ 50 శాతానికి కంటే తక్కువగా ఉంటే అప్పుడు చార్జీ రూ.10 మాత్రమే.

అలాగే సెబీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో గరిష్టంగా (75 శాతానికి పైగా బ్యాలన్స్ లేని సందర్భంలో) ఉన్న రూ.40 చార్జీ రూ.12, రూ.10కి తగ్గించడం జరిగింది.

ఈ చార్జీలకు జీఎస్టీ అదనం. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చార్జీల తగ్గింపుతో 25 కోట్ల కస్టమర్లకు ఉపశమనం కలగనుంది.

అదేవిధంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

ఇక కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది.

మామాట: నిజంగా ఇది ఖాతాదారులకు ఊరట కలిగించే విషయమే..

English summary:

The country’s largest lender, State Bank of India (SBI) has slashed charges for non-maintenance of Average Monthly Balance (AMB) in savings accounts by nearly 75 per cent.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *