రెడ్‌మీ నోట్ 9లో అదిరిపోయే ఫీచర్లు…ధర తక్కువే?

Share Icons:

ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ని త్వరలోనే ఇండియాలో విడుదల చేయనుంది. మార్చి 12వ తేదీన భారతదేశంలో లాంచ్ అవుతుందని షియోమీ వెల్లడించింది. దాని ఫీచర్లను తెలపడం కూడా ప్రారంభించింది. టీజర్ ను చూసిన దాని ప్రకారం రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఫోన్‌లలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకు ముందు జరిగిన లాంచ్‌లను పరిశీలిస్తే షియోమీ వచ్చే వారం తన ఆన్‌లైన్ ఈవెంట్‌లో రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో రెండు ఫోన్‌లను ఆవిష్కరించనుందని తెలుస్తుంది. ఆశ్చర్యకరంగా, వీటికి సంబంధించిన లీకులు ఎక్కువగా రాలేదు.

రెడ్‌మీ నోట్ 9, రెడ్ మీ నోట్ 9 ప్రో వేరియంట్ ధరల గురించి షియోమీ ఇంకా ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు. కానీ రెడ్‌మీ నోట్ 8 ప్రారంభ ధర రూ. 9,999గా ఉంది కాబట్టి రెడ్‌మీ నోట్ 9 ధర కూడా మనదేశంలో అదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక రెడ్‌మీ నోట్ 9 ప్రో విషయానికొస్తే దీని ధర రూ.15,000 రేంజ్ లో ఉండవచ్చు. రెడ్‌మీ నోట్ 8 ప్రో భారతదేశంలో రూ.14,999 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం రూ.13,999కు అందుబాటులో ఉంది.

రెడ్ మీ నోట్ 9 ఫీచర్లు…

స్క్రీన్‌ : 6.4 అంగుళాలు, గొర్రెల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌

ప్రాసెసర్‌ : స్నాప్‌ డ్రాగన్‌ 720జీ

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : వీ9.0

ర్యామ్‌ : 6జీబీ..స్టోరేజీ: 32జీబీ

రియర్‌ కెమెరా : 48+8+2+2 ఎంపీ

ఫ్రంట్‌ కెమెరా : 13 ఎంపీ

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్‌

పెరిగిన ఐఫోన్ల ధరలు

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ పలు ఐఫోన్ల ధరలను పెంచింది. 2020 బడ్జెట్‌లో కేంద్రం చెప్పిన విధంగా దిగుమతి సుంకం పెరిగినందున ఆపిల్‌ పలు ఐఫోన్ల ధరలను పెంచినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయా ఐఫోన్లను పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు.

ఐఫోన్‌ 8 (64జీబీ) – పాత ధర రూ.39,900 – కొత్త ధర రూ.40,500

ఐఫోన్‌ 8 (128జీబీ) – రూ.44,900 – రూ.45,500

ఐఫోన్‌ 8 ప్లస్‌ (64జీబీ) – రూ.49,900 – రూ.50,600

ఐఫోన్‌ 8 ప్లస్‌ (128జీబీ) – రూ.54,900 – రూ.55,600

ఐఫోన్‌ 11 ప్రొ (64జీబీ) – రూ.99,900 – రూ.1,01,200

ఐఫోన్‌ 11 ప్రొ (256జీబీ) – రూ.1,13,900 – రూ.1,15,200

ఐఫోన్‌ 11 ప్రొ (512జీబీ) – రూ.1,31,900 – రూ.1,33,200

ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (64జీబీ) – రూ.1,09,900 – రూ.1,11,200

ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (256జీబీ) – రూ.1,23,900 – రూ.1,25,200

ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (512జీబీ) – రూ.1,41,900 – రూ.1,43,200

 

Leave a Reply