ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ కె30ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీజింగ్‌లో జరిగిన షియోమీ డెవలపర్ సదస్సులో ఆ కంపెనీ సీఈవో లెయ్ జున్ వివరాలను వెల్లడించారు.
ఇందులో స్నాప్‌డ్రాగన్ 735 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆ ఫోన్లో అందివ్వనున్న ఇతర ఫీచర్ల వివరాలను వెల్లడించలేదు. ఇక రెడ్మీ కె30 ఫోన్లో గెలాక్సీ ఎస్10 ప్లస్ ఫోన్ తరహాలో పంచ్ హోల్ డిస్ప్లేను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మరిన్ని అధునాతన ఫీచర్లను ఆ ఫోన్లో యూజర్లకు అందివ్వనున్నామని షియోమీ తెలిపింది. అయితే డిసెంబర్లో ఏ తేదీన రెడ్మీ కె30 ఫోన్‌ను విడుదల చేస్తారో..ఆ వివరాలను మాత్రం షియోమీ వెల్లడించలేదు.
గెలాక్సీ నోట్ 10 ప్లస్
దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 10 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు గాను స్టార్‌వార్స్ స్పెషల్ ఎడిషన్ వేరియెంట్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన విడుదల కానున్న స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్ మూవీ సందర్భంగా ఈ వేరియెంట్‌ను విడుదల చేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌తోపాటు స్పెషల్‌గా డిజైన్ చేయబడిన కేస్, మెటల్ బ్యాడ్జ్, ఎస్ పెన్, గెలాక్సీ బడ్స్‌ను ఈ ఫోన్‌తోపాటు బండిల్‌గా అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్ రూ.93,580 ధరకు వినియోగదారులకు డిసెంబర్ 10వ తేదీ నుంచి లభ్యం కానుంది.
షియోమీ రీడర్…
షియోమీ అమెజాన్‌కు చెందిన కిండిల్ బుక్ రీడర్‌కు పోటీగా ఎంఐ రీడర్ పేరిట ఓ నూతన ఈ-బుక్ రీడర్‌ను లాంచ్ చేసింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఎంఐ రీడర్‌ను షియోమీ విక్రయించనుంది. రూ.6100 ధరకు ఎంఐ రీడర్‌ను షియోమీ విక్రయించనుంది.
ఇక ఈ డివైస్‌లో 6 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 24 రకాల బ్రైట్నెస్ ప్రీసెట్స్, మల్టిపుల్ ఫైల్ ఫార్మాట్లకు సపోర్ట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఓఎస్, యూఎస్బీ టైప్ సి, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు.