అక్టోబర్9న విడుదల కానున్న రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్…

Redmi 8 launching in India on October 9, company teases big battery, improved cameras
Share Icons:

ముంబై: అమ్మకాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ సంస్థ అక్టోబర్9 న రెడ్ మీ 88 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది.  దీపావళి కన్నా ముందే ఇండియాలో రెడ్‌మీ 8 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దసరా మరుసటి రోజు అక్టోబర్ 9న రెడ్‌మీ 8 రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది షావోమీ. వరుసగా కొత్త ఫోన్లు రిలీజ్ చేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

టీజర్‌లో కనిపించే ఇమేజ్‌ను బట్టి షావోమీ రిలీజ్ చేయబోయేది రెడ్‌మీ 8 అన్న ప్రచారం జరుగుతోంది. రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే రెడ్‌మీ 8 మోడల్‌లో ఫీచర్లు అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతున్నాయి. డ్యుయెల్ కెమెరా, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. అయితే దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.

రెడ్‌మీ 8 ఫీచర్లు…

డిస్‌ప్లే: 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ డిస్‌ప్లే

ర్యామ్: 4 జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439

బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

కలర్స్: రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్

అమ్మకాల్లో దూసుకుపోతున్న రెడ్ మీ 8ఏ

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఎ ను ఇటీవలే భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. అయితే దసరా సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఇచ్చిన ఆఫర్లకి తోడు, తక్కువ ధరకే మంచి ఫీచర్లు లభ్యం కావడంతో రెడ్ మీ 8ఏ సేల్స్ బాగా జరుగుతున్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6499 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999గా ఉంది.

రెడ్‌మీ 8ఏ ఫీచర్లు..

డిస్‌ప్లే : 6.22 అంగుళాల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌

ప్రాసెసర్‌ : ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439

ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 9.0పై,

కెమెరా : 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా,

సెల్ఫీ కెమెరా : 8 మెగాపిక్సల్‌

మెమొరీ : 2/3 జీబీ ర్యామ్‌,

స్టోరేజీ : 32 జీబీ స్టోరేజ్‌

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Leave a Reply