పృథ్వీ మీద పోసాని ఫైర్…కారణం ఇదేనా…!

Share Icons:

హైదరాబాద్: ఎస్వీబీసీ ఛైర్మన్..సినీ నటుడు పృథ్వీరాజ్‌ అమరావతి ప్రాంత నిరసనలు..రైతుల గురించి చేసిన వ్యాఖ్యల పైన పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్‌ వెంటనే రాజధాని రైతులకు బేష రతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.పృథ్వీరాజ్‌ ఎవరిని ఉద్దేశించి పెయిడ్‌ ఆర్టిస్టులని అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్‌.. చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడం లేదని వ్యాఖ్యానించారు . వాళ్లు పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారంటూ చెప్పుకొచ్చారు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీలాంటి వాళ్లు పుట్టారంటై మండిపడ్డారు. పృథ్వీరాజ్‌ ప్రభుత్వం తరఫునే మాట్లాడారని చెబితే… నా నిర్ణయం నేను తీసుకుంటానంటూ హెచ్చరించారు.

అయితే ఈ స్థాయిలో పృథ్వీ మీద పోసాని ఎందుకు ఫైర్ అయ్యారనేది ఆసక్తికరంగా మారింది. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులని చాలామంది వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ వారిని ఒక్క మాట కూడా అనని పోసాని పృథ్వీ మీద కామెంట్లు చేశారు. ఇలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. పోసాని వైసీపీలో ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నారు. కానీ ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చిన పృథ్వీ ఎస్‌వి‌బి‌సి ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. కానీ పోసానికి ఇంతవరకు ఏ పదవి రాలేదు. అందుకనే ఈ కారణం చేత కూడా పోసాని పృథ్వీపై ఫైర్ అయ్యి ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఇదిలా ఉంటే పృథ్వీరాజ్‌ ఎవరిని ఉద్దేశించి పెయిడ్‌ ఆర్టిస్టులని అన్నారో చెప్పాలన్నారు. కమ్మ రైతులు.. కమ్మ ఆడపడుచులను ఉద్దేశించి అన్నారా అని ప్రశ్నించారు. లేక, మొత్తం రాజధాని రైతులను అన్నారా అంటూ నిలదీసారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడంలేదుంటూ పోసాని వ్యాఖ్యానించారు. వాళ్లు పొలం పనులు చేసు కుంటూ గౌరవంగా బతుకుతున్నారని వివరించారు. వాళ్లను పృథ్వీ రోడ్డుమీదికి ఈడ్చారని ఆరోపించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు తాను పదేళ్ల నుండి విధేయుడగా ఉన్నానని..అప్పుడు వీళ్లెవరూ లేరని చెప్పుకొచ్చారు. జగన్‌ ఎప్పుడూ, ఎవరిమీదా నోరు జారలేదన్నారు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీలాంటి వాళ్లు పుట్టారని వ్యాఖ్యానించారు. మీలాంటి వాళ్లు జగన్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారుని.. వాళ్లందరివల్ల జగన్‌ను..వైసీపీని సోషల్‌ మీడియాలో తిడుతున్నారని చెప్పుకొచ్చారు.

 

Leave a Reply