నల్గొండ కాంగ్రెస్ నేత మర్డర్‌కు కారణం…అక్రమసంబంధం..!!

నల్గొండ కాంగ్రెస్ నేత మర్డర్‌కు కారణం…అక్రమసంబంధం..!!
Views:
14

నల్లగొండ, 13 ఫిబ్రవరి:

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఉప సర్పంచ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది రాజకీయ హత్య కాదని మిర్యాలగూడ పోలీసులు తేల్చేశారు.

అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణ లో తేలింది. సంచలనం రేపిన ఈ హత్య గురించి గ్రామస్తులు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

nalgonda dharma nayak murder case

నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగార్జునపేట తండా ఉపసర్పంచ్ దేపావత్ ధర్మానాయక్(45) నిన్న రాత్రి హత్యకు గురయ్యాడు.

ధర్మానాయక్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సావిత్రి. రెండో భార్య పేరు శిరీష. మొదటి భార్యకు పెళ్లయిన తర్వాత సంతానం కలగకపోవడంతో తన సొంత చెల్లెలు శిరీషను ఇచ్చి రెండో వివాహం జరిపించారు.

రెండో భార్యకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగింది. అయితే ధర్మానాయక్ వయసు 45 కాగా చిన్నభార్య శిరీష వయసు 22 మాత్రమే.

కాగా శిరీషకు అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.

దీనిపై దంపతులిద్దరిమధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో తన అక్రమ బంధానికి అడ్డువస్తున్నాడని భావించిన శిరీష చివరికి భర్తను చంపేయాలని నిర్ణయానికి వచ్చింది.

ప్రియుడితో కలిసి ధర్మనాయక్ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంచం కింద బాంబు పెట్టి దారుణంగా హత్య చేయించింది.

దీంతో ఆయన శరీర భాగాలు చిందరవందరగా పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బారి భద్రత ఏర్పాటు చేశారు.

మృతుడి తల్లి ద్వాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జున సాగర్ సీఐ రవీందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం రెండో భార్య శిరీషను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ప్రియుడు రవి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మామాట: రోజురోజుకి మితిమీరుతున్న ఇలాంటి ఆడవాళ్ళు….

English Summary: reason for nalgonda district congress leader murder was as his wife has an illegal affair with a man naming ravi and this lead his wife to kill him with ravi support.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *