తొలి 5జి స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసిన రియల్‌మి…

Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన తొలి 5జి స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి ఎక్స్‌50 5జి ని తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.25,805 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ను జనవరి 14వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఇందులో.. 6.57 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 765జి ప్రాసెసర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌10, డ్యుయల్‌ సిమ్‌, 64,12, 8, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు, సైండ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి, డాల్బీ అట్మోస్‌, 5జి ఎస్‌ఏ/ఎన్‌ఎస్‌ఏ, డ్యుయల్‌ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30 వాట్ల వీవోవోసీ ఫ్లాష్‌ చార్జ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఐటెల్‌ ఎ25

మొబైల్స్‌ తయారీదారు ఐటెల్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎ25ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.3,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 5 ఇంచుల డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై (గో ఎడిషన్‌), డ్యుయల్‌ సిమ్‌, 5, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, 3020 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

టొరెటో కంపెనీ బ్యాష్‌

టొరెటో కంపెనీ బ్యాష్‌ పేరిట ఓ నూతన పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.1799 ధరకు ఈ స్పీకర్‌ వినియోగదారులకు లభిస్తున్నది. బ్లూటూత్‌ 5.0తో ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో 5 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్‌ను అందిస్తున్నారు. ఈ స్పీకర్‌ చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. దీన్ని జేబులో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇందులో 1200 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ స్పీకర్‌ 6 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ స్పీకర్‌ను గంటన్నర వ్యవధిలోనే ఫుల్‌ చార్జింగ్‌ చేసుకోవచ్చు.

అమెజాన్‌ ఎకో ఆటో

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఎకో సిరీస్‌లో మరో నూతన డివైస్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఇక ఈ డివైస్‌ను రూ.4,999 ధరకు వినియోగదారులు అమెజాన్‌ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. జనవరి 15వ తేదీ నుంచి అమెజాన్‌ ఎకో ఆటో డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ ఎకో ఆటో పేరిట విడుదలైన ఈ డివైస్‌ను యూజర్లు తమ కార్లలో అమర్చుకోవచ్చు. కారులోని 12 వోల్టుల చార్జింగ్‌ సాకెట్‌ లేదా యూఎస్‌బీ పోర్టు ద్వారా ఈ డివైస్‌ పవర్‌ తీసుకుంటుంది. దీన్ని ఫోన్‌కు బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌లో ఉండే అలెక్సా యాప్‌ సహాయంతో ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో ఫోన్‌ ద్వారా ఈ డివైస్‌ నుంచి మ్యూజిక్‌ స్ట్రీమ్‌ చేయవచ్చు. కాల్స్‌ చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు.

 

Leave a Reply