ఈ నెల 20న రానున్న రియల్‌మి ఎక్స్2 ప్రొ…

REALME X2 PRO TEASED BY FLIPKART AHEAD OF ITS 20 NOVEMBER LAUNCH IN INDIA
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్2 ప్రొను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.27,170 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

ఫీచర్లు

6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 64, 13, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ .

నోకియా స్మార్ట్ టీవీలు

ఇండియా దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియాతో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ నోకియా బ్రాండ్ పేరిట సదరు స్మార్ట్‌టీవీలను విక్రయించనుంది. ఫ్లిప్‌కార్ట్ తయారు చేయనున్న నోకియా స్మార్ట్‌టీవీల్లో జేబీఎల్ కంపెనీకి చెందిన సౌండ్ ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ మేరకు జేబీఎల్ మాతృసంస్థ హర్మాన్‌తో ఫ్లిప్‌కార్ట్, నోకియాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో హై క్వాలిటీ ఆడియో ఎక్విప్‌మెంట్ కలిగిన నోకియా స్మార్ట్‌టీవీలు త్వరలో భారత్‌లోని వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ టీవీలను ఎప్పుడు లాంచ్ చేయ‌నున్నార‌నే వివ‌రాల‌ను ఆ కంపెనీలు వెల్లడించలేదు.

షియోమీ ఎం‌ఐ వాచ్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ వాచ్ పేరిట తన నూతన స్మార్ట్‌వాచ్‌ను తాజాగా చైనాలో విడుదల చేసింది. ఇది త్వరలోనే ఇండియాలో విడుదల కానుంది. ఇందులో ఆపిల్ వాచ్‌కు దీటుగా ఫీచర్లను అందిస్తున్నారు. 1.78 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్‌ప్లేను ఎంఐ వాచ్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 100కు పైగా వాచ్ ఫేసెస్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ వియర్ 3100 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, వియర్ ఓఎస్, 4జీ ఇ-సిమ్‌కు సపోర్ట్ తదితర ఫీచర్లను కూడా ఈ వాచ్‌లో అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ వాచ్ 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. 10 రకాల స్పోర్ట్స్ యాక్టివిటీలను ఈ వాచ్ ట్రాక్ చేయగలదు. ఇందులో 8జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్, స్విమ్ ప్రూఫ్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 570 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. కాగా ఈ వాచ్ ధర రూ.13,125గా ఉంది.

Leave a Reply