రియల్‌మి నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌..స్పెషల్ ఫీచర్లు ఇవే…

Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన ఫ్లాగ్‌షిప్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి ఎక్స్‌50 ప్రొ 5జీని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రియల్‌మికి చెందిన మొదటి 5జీ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. రియల్‌మి ఎక్స్‌50 ప్రొ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.37,999 ఉండగా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.39,999గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ టాప్‌ ఎండ్‌ వేరియెంట్‌ ధర రూ.44,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.

కాగా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 6.44 ఇంచుల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేకు 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ పంచ్‌ హోల్‌ కెమెరాను అమర్చారు. దీనికి తోడుగా 8 మెగాపిక్సల్‌ కెపాసిటీ కలిగిన మరో అల్ట్రా వైడ్‌ లెన్స్‌ పంచ్‌ హోల్‌ కెమెరా కూడా ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 865 అధునాతన ప్రాసెసర్‌, 12 జీబీ వరకు ర్యామ్‌, కూలింగ్‌ టెక్నాలజీ, 5జీ వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 4 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకటి 64 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా కాగా, మరొకటి 8 మెగాపిక్సల్‌ అల్ట్రా వైడ్‌లెన్స్‌, ఇంకొకటి 12 మెగాపిక్సల్‌ టెలిఫొటో లెన్స్‌గా ఉన్నాయి. ఇక మరో 2 మెగాపిక్సల్‌ కెపాసిటీ ఉన్న డెప్త్‌ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ వెనుక భాగంలో 3డీ ఏజీ గ్లాస్‌ బ్యాక్‌ను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. 65 వాట్ల సూపర్‌ డార్ట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీని సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే ఫోన్‌ను 0 నుంచి 100 శాతం వరకు చార్జింగ్‌ చేసుకోవచ్చు.

రియల్‌మి ఎక్స్‌50 ప్రొ 5జీ ఫీచర్లు…

6.44 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

1080 x 2400 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌

2.8 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌

6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

64, 12, 8, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

32, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు

ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌

యూఎస్‌బీ టైప్‌ సి, 5జీ, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్‌ 5.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి

4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 వాట్ల సూపర్‌డార్ట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌

 

Leave a Reply