ఫిబ్రవరి 6న విడుదల కానున్న రియల్‌మీ సీ3…బెస్ట్ ఫీచర్స్…

Realme C3 official look, specs revealed
Share Icons:

ముంబై: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్ మీ సంస్థ…మరో కొత్త మొబైల్‌ని ఇండియాలో విడుదల చేయనుంది. ఇప్పటికే సీ సిరీస్‌లో రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే సిరీస్‌లో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 12.30 గంటలకు ఇండియాలో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ కానుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్ డ్రాప్ నాచ్, డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అవుతుంది. ఇందులో 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 7,999గా ఉంది. మిగతా వివరాలు ఫోన్ విడుదల రోజున తెలియనున్నాయి.

రియల్‌మీ సీ3 ఫీచర్లు

డిస్‌ప్లే: 6.5 అంగుళాలు

ర్యామ్: 3జీబీ, 4జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ

రియర్ కెమెరా: 12+2మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 8MPఫ్రంట్ కెమెరా

బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

జియో ఎక్కువ రోజుల వాలిడిటీ ప్లాన్స్

జియో రూ.2,020: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు.

జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 12,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

జియో రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా వాడుకోవచ్చు.

జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 3,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

 

Leave a Reply