ఇండియాలో విడుదలైన రియల్‌మి సి3, లావా జడ్‌53

Realme C3 official look, specs revealed
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి సి3ని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6,999 ఉండగా, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.7,999గా ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఈ ఫోన్‌ కొనుగోలుపై జియో రూ.7550 విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది.

రియల్‌మి సి3 ఫీచర్లు…

6.52 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌3 ప్లస్‌ ప్రొటెక్షన్‌

ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జి70 ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌

32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10.0

12, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

లావా జడ్‌53

మొబైల్స్‌ తయారీదారు లావా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ జడ్‌53 ని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో కేవలం 0.4 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఊ.4829 ధరకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్‌ సందరంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. జియో వినియోగదారులు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.1200 విలువైన ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో పొందవచ్చు. అలాగే 50జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది.

లావా జడ్‌53 ఫీచర్లు…

6.1 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌

16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌

8, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2

4120 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Leave a Reply