రియల్‌మి 5ఐ వచ్చేసింది…ధర ఎంతటే?

realme 3i smartphone released in india
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5ఐ ని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు జనవరి 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్‌ సందర్భంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. జియో తన కస్టమర్లకు రూ.7550 విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది. క్యాషిఫై ద్వారా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి ఈ ఫోన్‌ను కొంటే రూ.500 అదనపు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ను ఇస్తారు.

ఇందులో.. 6.52 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 12, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

స్పార్క్‌ గో ప్లస్‌

టెక్నో కంపెనీ స్పార్క్‌ గో ప్లస్‌ పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో.. 6.52 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ హీలియో ఎ22 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై గో ఎడిషన్‌, 8, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.6,299 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

 

ఏఎస్‌పీ టీడబ్ల్యూఎస్‌ 615

అమానీ కంపెనీ ఏఎస్‌పీ టీడబ్ల్యూఎస్‌ 615 పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఇవి బ్లూటూత్‌ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే 10 గంటల వరకు నాన్‌స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. రూ.999 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు లభిస్తున్నాయి.

అమేజ్‌ఫిట్‌ కంపెనీ టి-రెక్స్‌

అమేజ్‌ఫిట్‌ కంపెనీ టి-రెక్స్‌ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో.. 1.3 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ మానిటర్‌, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, 19 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.10,070 ధరకు ఈ వాచ్‌ వినియోగదారులకు లభిస్తున్నది.

 

Leave a Reply