అందుకే ‘ఎన్టీఆర్’ సినిమా ఒప్పుకోలేదు…

real-reason-why-keerthi-suresh-rejected ntr biopic
Share Icons:

హైదరాబాద్, 17 అక్టోబర్:

కీర్తి సురేశ్… ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకున్న నటి. మహానటిలో సావిత్రి పాత్రలో ఆమె నటనకి యూత్‌తో పాటు పెద్దలు సైతం ఫిదా అయిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే సావిత్రి పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసి మరీ నటించింది. 

అయితే అంత పేరు తెచ్చిన పాత్రలో మరోసారి నటించే అవకాశం వస్తే మాత్రం నో చెప్పేసింది కీర్తి సురేశ్. దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేశ్‌ని సంప్రదించగా ఆమె అంగీకరించలేదు.

అయితే దానికి గల కారణాలను కీర్తి  తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ”మహానటి అనేది ఒక మ్యాజిక్ అని, మళ్లీ తాను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.

అందుకే ఆ పాత్రను మళ్లీ టచ్ చేయాలనుకోలేదని చెప్పింది.

సావిత్రి మాత్రమే కాదని, ఇకపై బయోపిక్ సినిమాలు వేటిలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మామాట: ఓహో…మళ్ళీ ఆ పాత్రని టచ్ చేయకూడదు అనుకున్నారనమాట

Leave a Reply