Header Banner
Header Banner
TRENDING NOW

 నటుడుగా రీ ఎంట్రీ – బండ్ల గణేశ్?

 నటుడుగా రీ ఎంట్రీ – బండ్ల గణేశ్?

హైదరాబాద్, ఏప్రిల్ 19,

తెలుగు తెరపై కమెడియన్ గానే బండ్ల గణేశ్ తన కెరియర్ ను ప్రారంభించాడు. అలా కొన్ని సినిమాల్లో హాస్యనటుడిగా చేసిన ఆయన, ఆ తరువాత నిర్మాతగా మారిపోయి పెద్ద హీరోలతో భారీ చిత్రాలను నిర్మించాడు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటోన్న ఆయన, మళ్లీ నటుడిగా తెరపై కనిపించనున్నాడని తెలుస్తోంది.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. ఆ పాత్ర నచ్చడంతో వెంటనే బండ్ల గణేశ్ అంగీకరించాడని అంటున్నారు.

కామెడీ ఎపిసోడ్స్ ను తనదైన శైలిలో డిజైన్ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. బండ్ల గణేశ్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బండ్ల గణేశ్ ఇక నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.

మామాట: మనకు తెలిసిన దారిలో పోతే బెటర్ కదా. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: