వన్డేలకు ధోని రిటైర్మెంట్? కోచ్ రవిశాస్త్రి కామెంట్స్…

dhoni responds over his retirement
Share Icons:

ముంబై: టీమిండియాకు అనేక అద్భుత విజయాలు సాధించి పెట్టిన మాజీ సారథి ఎం‌ఎస్ ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుంచో కామెంట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ధోనీ త్వరలో వన్డేలకు గుడ్‌బై చెప్పే అవకాశముందని టీమిండియా కోచ్‌ రవిశాస్ర్తి వెల్లడించాడు. జట్టుకు అతడు ఎప్పుడూ భారం కాడని చెప్పాడు. ఇక..ఐపీఎల్‌ ఫామ్‌ ధోనీ కెరీర్‌కు కీలకమని అభిప్రాయపడ్డాడు. ‘‘ధోనీతో నేను మాట్లాడా. ఆ విషయాలు మా ఇద్దరి మధ్యే ఉంటాయి. బహుశా త్వరలో వన్డేలకూ వీడ్కోలు పలికే అవకాశముంది’’ అని అన్నాడు.

రాబోయే ఐపీఎల్‌లో కనుక సత్తా చాటితే టీ20 వరల్డ్‌కప్‌ జట్టు రేసులో ధోనీ కచ్చితంగా ఉంటాడని స్పష్టంజేశాడు. మహీ ఫిట్‌నెస్‌ అద్భుతమంటూ…అతడి ఫిట్‌నె్‌సను కపిల్‌దేవ్‌తో పోల్చాడు. కాగా టెస్ట్‌ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను మతిలేని చర్యగా రవిశాస్ర్తి అభివర్ణించాడు.

ఇదిలా ఉంటే నేడు  టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే, రెండో మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక నేడు జరిగే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. లేదంటే సిరీస్ డ్రా అవుతుంది. ఇక టీమిండియా సారథి మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 30 పరుగులు చేసిన కోహ్లీ.. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 10,999 అంతర్జాతీయ పరుగులు చేశాడు.

పుణె వేదికగా శుక్రవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరొక్క పరుగు చేస్తే కెప్టెన్‌గా 11000 పరుగులు పూర్తి చేసిన ఆరో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే ఈ ఘనతను ఐదుగురు సాధించారు. అయితే టీమిండియా తరఫున మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఒక్కడే ఇదివరకు ఈ ఘనత సాధించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ తన ఖాతాను ఓపెన్ చేస్తే చాలు అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 10,999 పరుగులు చేశాడు.

 

Leave a Reply