TRENDING NOW

కర్నూల్లో రీవ్ పార్టీ కలకలం

కర్నూల్లో రీవ్ పార్టీ కలకలం
Views:
90

కర్నుల్, నవంబర్ 08,

కర్నూలు పట్టణంలో ఇటీవల అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతూ ఉండడం పట్టణవాసులను కలవర పెడుతోంది.  ముఖ్యంగా మహా నగరాలకు మాత్రమే పరిమితమైన రీవ్ పార్టీకల్చర్ కర్నూలుకు చేరడంపై సీనియర్ సిటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. వీటి కారణంగా గ్రామీణ, మధ్యతరగతి యువత కూడా చెడుమార్గం పట్టే అవకాశం ఉందని అవేదన చెందుతున్నారు. మొత్తం మీద జిల్లోలోనే ఇటువంటి శైలిని ఇప్పటికే యువత పెద్ద ఎత్తున ఆదరిస్తున్నట్టు పోలీసుల వద్ద నమోదవుతున్న గణాంకాలు రుజువుచేస్తున్నాయి. తాజాగా రీవ్ పార్టీలో సభ్యులకు, డాన్సింగ్ యువతులకు మధ్య జరిగిన గొడవ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో జిల్లావాసులు కలవరపడ్డారు. ఒక వారం రోజుల వ్యవధిలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ రీవ్ పార్టీలపై పోలుసులు వెంటనే దృష్టి పెట్టాలని పెద్దలు ఆశిస్తున్నారు. కాగా జిల్లాలో పేరున్న ఎరువుల వ్యాపార సంస్థ ఈ రీవ్ పార్టీలు నిర్వహించడం విశేషం. వీరు ఇతర నగరాల నుంచి పెద్ద మొత్తం చెల్లించి యువతులను డాన్సర్స్ పేరుతో రప్పిస్తున్నారని, అందుకే ఈ పార్టీలలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సంఘటనపై చివరకు పోలీసులు కలగజేసుకుని, కేసు కూడా నమోదు చేయడం వరకూ పరిస్థితి వచ్చిందంటే ముందు ముందు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అనుకుంటున్నారు.

మామాట : పట్టణం విస్తరిస్తూ.. నగరంగా మారుతూ ఉంటే ఇటువంటివికూడా చేరుతాయా…

(Visited 137 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: