కోర్టులో లొంగిపోయిన లాలూ

Share Icons:

పాట్నా, ఆగస్టు 30,

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయజనతాదళ్ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో గురువారం ఉదయం జార్ఖాండ్ సిబిఐ కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి  ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, లాలూ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ఠ్యా ఆయన పాత వైద్యులను సంప్రదించి చికిత్సవివరాలు తెలుసుకోవాలని బిర్సా ముండా జైలు అధికారులను ఆదేశించారు. అలాగే  రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( రిమ్స్) వైద్యుడు

ఉమేష్ ప్రసాద్ చేత కూడా చికిత్స అందించాలని జైలు అధికారలను ఆదేశించారు.  గత ఏడాది దాణా కేసులో లాలూకి  కోర్టు జైలు శిక్షవిధించింది. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా గత మే 11 న ఆరు వారాల పెరోల్ పై లాలూ విడుదలయ్యారు. అనంతరం తనకు ఇంకా బెయిల్ పొడిగించమని లాలూ చేసుకున్న ధరఖాస్తును తిరస్కరించిన కోర్టు ఆగస్టు 30 లోగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

మామాట: అధికారంలో ఉన్నపుడు విర్రవీగినవారికి… ఇదో గుణపాఠం

 

Leave a Reply