అయ్యో..! రష్మిక ఎంత పని చేశావ్…

Share Icons:

హైదరాబాద్:

 

రష్మిక మందాన….ఇప్పుడుప్పుడే తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా ఎదుగుతున్న కన్నడ భామ. ఛలో,గీతగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలతో మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇక మూడు సినిమాలతోనే ఆమె మహేశ్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ కొత్త చిత్రం, నితిన్ భీష్మల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

 

అయితే కన్నడ నటి అయిన రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె కార్తీ హీరోగా ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది. అయితే ఆమె కొంచెం ఆతృతతో ఆ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటో షేర్ చేయడంతో పాటు ఆ చిత్ర టైటిల్ సుల్తాన్ అని రివీల్ చేసేసింది. దీంతో  చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ గురైందని సమాచారం.

 

కాగా, గత కొంతకాలంగా కార్తీ తర్వాత సినిమా టైటిల్ సుల్తాన్ అని వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం అధికారికంగా టైటిల్ ని ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో రష్మిక తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ లో సినిమా టైటిల్ లొకేషన్ షేర్ చేసింది. అధికారికంగా ప్రకటించకుండానే టైటిల్ బయటకు రావడంతో చిత్ర యూనిట్ కొంచెం అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక ఎలాగో బయటకొచ్చేసింది కాబట్టి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

 

Leave a Reply