అదే వచ్చిన చిక్కంతా..

Share Icons:

అదే వచ్చిన చిక్కంతా.. పత్రిక అనే అక్షరాల కర్మాగారం పెట్టిన ఆయనకు మాదిరే, ఆయన స్కూల్లో అక్షరాలు బోధించిన గురువులు కానీ, నేర్చుకున్న శిష్యులు కానీ.. మొండి, పెంకి ఘటాలు. కుండ బద్దలు కొట్టడంలో ఘటికులు…   ‘రామోజీరావు – ఉన్నది ఉన్నట్టు’ అని పేరుపెట్టి మరీ.. ఉన్నది ఉన్నట్లే, అన్నది అన్నట్లే..  నాలుగు దశాబ్దాల పత్రికా రచనానుభవం గడించిన  నిర్మొహమాటి ఈనాడులో  సహచర కలంకారుడు…  డాక్టర్ గోవిందరాజు చక్రధర్ రూపొందించిన 374 పేజీల స్వేదాక్షరాల సముచ్ఛయం.. ఇప్పుడే అందుకున్నా.

కొందరు మినహాయిస్తే…”ఈనాడు” వాళ్ళందరూ, రాజీపడకుండా, అలవోకగా  రాజీనామా ఉత్తరాలు విసిరేసి రొమ్ము విరుచుకుని బయటకు నడిచిన ధీరోదాత్తులే.  ఈ పుస్తకంలో  మా చక్రధర్ కేవలం తన భావాలకు మాత్రమే కాకుండా, సంస్థలో మమేకమైన వారి అనుభవాలు, ఆలోచనలకు సముచిత స్థానం కల్పించి .. వారు రాసింది రాసినట్లు అచ్చేసారు.  ఈ అనుభవాల నిక్షిప్తంలో నాకూ చోటుదక్కడం గర్వకారణమే. ఈ పుస్తకాన్ని విశ్లేషించాలంటే ఏకబిగిన పక్షం రోజులైనా కదలకుండా చదవాల్సిందే.  ఇవి కేవలం పరిచయ వాక్యాలు మాత్రమే.

-నందిరాజు రాధాకృష్ణ 

Those who are interested to have the book, (Rs 300/-) may contact Dr Chakradhar Govindaraju mobile.98498 70250, chakradhargovindaraju@gmail.com

Leave a Reply