క్రికెట్ కోచ్ గా రమేశ్ పవార్

Share Icons:

ముంబయి, జూలై 16: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ బాధ్యతలను మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌కు అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అరె.. టీమిండియాకు రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నాడు కదా. మరి ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా! రమేశ్‌ పవార్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుంది..  భారత మహిళల క్రికెట్‌ జట్టుకు.

కొద్ది రోజుల క్రితం భారత్‌ మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ క్రీడాకారిణులు కోచ్‌ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్‌ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్‌ జట్టుతో కలవనున్నాడు. ‘బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా’ అని పవార్‌ తెలిపారు.

‘వచ్చే నెలలో భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కోచ్‌ను ఎంపిక చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశాం. జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్‌ క్లాస్‌ జట్టుకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న 55 సంవత్సరాలలోపువారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చిన బీసీసీఐ తెలిపింది. ఈ నెల 20లోగా దరఖాస్తులు పంపాలని సూచించింది. రమేశ్‌ పవార్‌ భారత్‌ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు.

మామాట: ఇకనైనా మహిళలజట్టు ముందడుగు వేస్తుందా

Leave a Reply