‘ఆర్‌ఆర్‌ఆర్’లో చెర్రీ నటించడానికి కారణం ఎవరో తెలుసా..?

ramcharan and ntr multistarer movie in the direction of rajamouli
Share Icons:

హైదరాబాద్, 13 జూన్:

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడుగా కొనసాగుతున్న రాజమౌళి బాహుబలి లాంటి సంచలన విజయం తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడని తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలోఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు

అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు.

కాగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి బయటకొచ్చింది.

Are NTR Charan going to shoot in rain

దాని ప్రకారం.. మొదట రాజమౌళి ఈ సినిమా కథను ఎన్టీఆర్‌కి చెప్పాడట. కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాలో మరో హీరో పాత్రలో రామ్ చరణ్ అయితే బాగుంటుందని రాజమౌళికి ఎన్టీఆర్ సలహా ఇచ్చాడని సమాచారం.

ఎంతో మంది స్టార్ హీరోలున్నప్పటికీ ఎన్టీఆర్, తన స్నేహితుడైన చెర్రీనే సూచించడం విశేషం. మరి ఇలా ఇద్దరు బడా స్టార్లు కలిసి నటించనున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మామాట: పుకార్లుకి ఏముంది బోలెడు షికారు చేస్తాయి…

Leave a Reply