తండ్రిపై పోటీకి సై అంటున్న కూతురు….

Ram Vilas Paswan’s Daughter, Son-in-law to Contest Against Him in 2019 Elections
Share Icons:

పాట్నా, 14 సెప్టెంబర్:

2019 ఎన్నికల్లో లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్‌పై ఆయన కూతురు ఆషా పాశ్వాన్ పోటీ చేయడానికి సై అంటున్నారు. ఈ మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జేడీ అవకాశమిస్తే తన తండ్రి పైనే పోటీకి సిద్ధమని ఆషా పాశ్వాన్ ప్రకటించారు.

తాను రాజకీయాల్లో రాణించేందుకు సహకరించకుండా, కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ రాజకీయ భవిష్యత్ కోసం తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పాటుపడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు.

ఇక హజిపుర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన తండ్రిపై పోటీకి సిద్ధమని ఆషా ప్రకటించడంతో బీహార్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

కాగా, రామ్ విలాస్ పాశ్వాన్ మొదటి భార్య కూతురు ఆషా. అయితే 1981లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పాశ్వాన్ రీనాను 1983లో పెళ్లి చేసుకున్నాడు. చిరాగ్ పాశ్వాన్ వీరిద్దరి కుమారుడే కావడం గమనార్హం.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆషా భర్త అనిల్ సాధు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ అవకాశమిస్తే తాను కూడా మామపై పోటీకి రెడీ అని అనిల్ సాధు ప్రకటించడం విశేషం….

 మామాట: పాశ్వాన్ ఓడించడానికి సొంత కుటుంబమే ట్రై చేస్తున్నట్లుంది…

Leave a Reply