బాక్సాఫీసుపై ఇస్మార్ట్ దండయాత్ర….తొలిరోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే…?

ram ismart shankar first day collections
Share Icons:

హైదరాబాద్:

 

రామ్ పోతినేని హీరోగా…..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం….నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమాకు అనుకున్న అంత పాజిటివ్ టాక్ రాలేదు….ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుందని టాక్ వచ్చింది. కానీ మాస్ ఎంటర్టైనర్ కావడంతో సినిమా మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి..

 

ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్లో కూడా ఎప్పుడూ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. ఫ‌స్ట్ డే ఇటు తెలంగాణ‌.. అటు ఆంధ్రాలో చిన్న‌సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు ఇస్మార్ట్ శంక‌ర్. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 7.83 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. గ్రాస్ అయితే 14 కోట్ల‌కు పైగానే వ‌చ్చింది. ఇక ఓవర్సీస్ కూడా కలుపుకుంటే తొలిరోజే 8.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ వీకెండ్ అంతా ఇస్మార్ట్ విధ్వంసం ఇలాగే సాగేలా క‌నిపిస్తుంది.

 

అన్ని ఏరియాల్లో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది ఇస్మార్ట్ శంక‌ర్. పూరీ మార్క్ మాస్ డైలాగుల‌తో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.  ఇక ఈ సినిమా మొత్తం సుమారు 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు ఉన్న ఊపుని చూస్తుంటే ఇస్మార్ట్ నాలుగు రోజుల్లోనే ఈ టార్గెట్ అందుకునేలా కనిపిస్తుంది.

Leave a Reply