చంద్ర‌బాబు ఏడ్చింది ‘ఇందుకే’ అంటూ కారణాన్ని వివరించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌!?

Share Icons:

తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. అయితే “ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టెదో దారి” అన్నట్లు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ తీరే వేరు.  బాబు తాను రూపొందించిన‌ “ప‌వ‌ర్ స్టార్‌ ఆర్జీవీ మిస్సింగ్” ట్రైల‌ర్ చూసే ఏడ్చేశాడంటున్నాడు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈ మేర‌కు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి, ఆయ‌నే మాట్లాడుతున్న‌ట్లుగా ఓ మిమిక్రీ వాయిస్‌ను జ‌త చేశాడు. ‘ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు’ అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా ఉంది. దీనికి వ‌ర్మ‌.. ‘ఇందాకే బాబు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న స్పంద‌న‌కు ధ‌న్య‌వాదాలు’ అని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఈ ర‌కం ప్ర‌మోష‌న్స్ తామెక్క‌డా చూడ‌లేదు అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే `ఆర్జీవి మిస్సింగ్‌` చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి వారి పాత్రలను సెటైరికల్‌గా చూపించారు వర్మ.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

 

Leave a Reply