Ram Charan: రామ్ చరణ్ బెస్ట్ పెయిర్ ఆమెనే! చిరంజీవి ఓటు కూడా అటే..

Share Icons:
మెగా హీరోలుగా సత్తా చాటుతూ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు తండ్రీకొడుకులు , రామ్ చరణ్. అయితే ఇన్నాళ్లు ఇండిపెండెంట్‌గా హిట్స్ పట్టేసిన ఈ మొనగాళ్లు ఇప్పుడు ఒకే సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. అదేనండీ.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’లో చిరంజీవితో పాటు కూడా సందడి చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో చెర్రీ జోడీగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనే కోణంలో వేట ప్రారంభించిన చిత్రయూనిట్ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి ఓటేసిందని తెలుస్తోంది.

Also Read:
ఇప్పటికే ఆచార్య మూవీలో చిరంజీవి జోడీగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ని కన్ఫర్మ్ చేశారు. ఇక రామ్ చరణ్ జోడీ కోసం గత కొంతకాలంగా పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన కొరటాల చివరగా కియారా అద్వానీని ఫిక్స్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారట. ఈ విషయాన్ని చిరంజీవితో కూడా చర్చించగా ఆయన కూడా రామ్ చరణ్ బెస్ట్ పెయిర్ కియారనే అని చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్ చరణ్- కియారా జోడీ చూడముచ్చటగా ఉందని, ‘ఆచార్య’లో కూడా ఆమెనే తీసుకోవాలని చిరంజీవి రికమండ్ చేశారట.

చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ రూపొందుతోంది. దాదాపు 30 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. చిత్రంలో చిరంజీవికి శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించనుండటం విశేషం. సో.. చూడాలి మరి చిరంజీవి కోరికను కియారా అద్వానీ తీరుస్తుందా.. లేదా? అనేది.