నాకు ప్రేమ, పెళ్లి అంటే ఇష్టమే…

Share Icons:

హైదరాబాద్, 21 నవంబర్:

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు… ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ పెళ్లివైపు అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది

తాజాగా ఇదే విషయమై కుల్ ప్రీత్ సింగ్‌ను వాళ్లమ్మ కూడా నిలదీసిందట. ఈ విషయాన్ని స్వయంగా రకులే చెప్పింది. ‘ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ బిజీగా గడుపుతున్నావు. నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించుకోవా?’ అని అడిగిందట.

అమ్మ తన పెళ్లి గురించే అలా మాట్లాడిందని తనకు అర్థమైందని… కాసేపు మౌనంగా ఉండిపోయానని రకుల్ తెలిపింది. ఇక తాను ఎందుకు సింగిల్ గా ఉంటున్నానో తనకే అర్థం కావడం లేదని చెప్పింది. తనకొక మంచి జీవిత భాగస్వామిని చూడమని తన స్నేహితులకు కూడా చెబుతుంటానని… కానీ, వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపింది. వయసు అయిపోతోంది, త్వరగా పెళ్లి చేసుకోమని అమ్మ చెబుతోందని అంది.

తనకు కూడా ప్రేమ, పెళ్లి అంటే ఇష్టమేనని చెప్పింది. మంచి అబ్బాయిని చూడమని హైదరాబాదులో ఉన్న స్నేహితులకు చెప్పానని, వాళ్లు ఆ పని మీదే ఉన్నారని అమ్మకు చెప్పానని తెలిపింది.

మామాట: మొత్తం మీద రకుల్ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనుంది అనమాట...

Leave a Reply