నితిన్ జోడిగా రకుల్ !

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 18,

చూస్తుంటే రకుల్ కూడా నయనతార బాటలోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒక వైపున నాగార్జున .. కార్తీ .. సూర్య వంటి సీనియర్ హీరోల సరసన మెప్పిస్తూనే, మరో వైపున బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోలతోనూ జోడీ కడుతోంది. తాజాగా ఆమె నితిన్ జోడిగా ఛాన్స్ కొట్టేయడం విశేషం. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమై వున్నాయి. ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాను కూడా నితిన్ చేయనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కృష్ణ చైతన్య ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

మామాట: అందరితో పనిచేయాలికదా మరి

Leave a Reply