రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల…ఏపీలో 4, తెలంగాణలో 2

TDP supports congress candiate in rajyasabha deputy chairman election
Share Icons:

ఢిల్లీ: మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో కేవీపీ, గరికాపాటి రాంమోహన్ రావు పదవీకాలం ముగుస్తుంది. అటు ఏపీలో కూడా కే కేశవరావు, ఏంఏ ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, సీతామహాలక్ష్మి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే శాసనమండలిని రద్దుతో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ కూడా మొదలు పెట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ పట్టేందుకు నేతలంతా పావులు కదుపుతున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి నాలుగు సీట్లు దక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వైసీపీలో పెద్ద లిస్టే రెడీ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి రాజ్యసభ ఎన్నికలో కొత్త ముఖాలు కనిపిస్తాయని ఏపీ రాజకీయ వర్గాల సమాచారం. కొత్తగా పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

రాజ్య‌స‌భ రేసులో నేత‌ల పేర్ల జాబితా ఇలా వినిపిస్తోంది. ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి రాజ్య‌స‌భ సీటు దాదాపు ఖ‌రారు అయినట్టేననే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన నేతల్లో ఆళ్ల రామిరెడ్డి కూడా ఉన్నారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఈయన బంధువు వారి కుటుంబానికి రాజ్య‌స‌భ సీటు విష‌యంలో భ‌రోసా ల‌భించినట్టేనని అంటున్నారు. ఇక బీద మ‌స్తాన్ రావు పేరు కూడా రాజ్య‌స‌భ రేసులో వినిపిస్తోంది. ఇంతలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ పేర్లు కూడా తెర మీద‌కు రావడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ ముగ్గురిలో ఒక‌రికి మాత్రం కచ్చితంగా రాజ్య‌స‌భ సీటు ల‌భిస్తుంద‌నే ప్ర‌చారం కొనసాగుతోంది. ఇంకా ఈ జాబితాలో కిల్లి కృపారాణి సహా పలువరు ఆశావ‌హులుగా ఉన్నట్టు సమాచారం.

 

Leave a Reply