ఆగష్టు 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

No confidence motion debate on rajyasabha
Share Icons:

ఢిల్లీ, 6 ఆగష్టు:

ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. అలాగే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్ వేసేందుకు గడువు ఇస్తున్నట్లు చెప్పారు.

కాగా, పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఇటు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తోన్నాయి. 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో 123 మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి వరిస్తుంది. అయితే 14 మంది అన్నాడీఎంకే సభ్యులతో కలిసి ఎన్డీఏ బలం 106 కాగా, 6గురు టీడీపీ సభ్యులతో కలిసి ప్రతిపక్షాల బలం 117.

దీంతో ఈ ఎన్నికలో బీజేడీ, టీఆర్ఎస్ పార్టీలు కీలకంగా మారనున్నాయి. ఇక వారిని తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ అభ్యర్థిగా నరేష్ గుజ్రాల్ ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.

మామాట: మరి ఉపసభాపతి పీఠం ఎవరికి దక్కుతుందో?

Leave a Reply