రాజీవ్ హంతకుల విడుదల కుదరదు… కేంద్రం

రాజీవ్ హంతకుల విడుదల కుదరదు… కేంద్రం
Views:
9

కొత్తఢిల్లీ, ఆగస్టు 10,

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు విధించిన ఏడుగురు నిందితులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించినట్లు కేంద్ర ప్రభుత్వంసుప్రీం కోర్టు కు తెలియజేసింది. రాజీవ్ హత్యకు సంబంధించి వేలూరు జైల్లో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న మురగన్, శాంతన్ ,పెరరివలన్, నళిని, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్లను క్షమాభిక్షపై విడుదల చేయాలన్న కేసులో సుప్రీం ధర్మాసనం  విచారణ జరుపుతేంది. కాగా, ఈ దేశంలో జరిగిన నేరాలలో ఈ హత్య అసమానమైనది. “కొన్ని రాష్ట్రాలలో లోక్సభ, అసెంబ్లీ లకు ఎన్నికలు వాయిదా వేయవలసివచ్చినంత  క్రూరమైన చర్య,  భారతీయ ప్రజాస్వామ్య విధానానికి సవాలు విసిరిన నేరమిదని”  కేంద్రం వెల్లడించింది.

తమిళనాడు ప్రభుత్వ సలహా మేరకు ఇపుడు రాజీవ్ హంతకులను క్షమాభిక్ష పేరుతో విడిచిపెడితే అదో ప్రమాదకరమైన సంప్రదాయంగా స్థిరపడుతుంది, భవిష్యత్తులో అంతర్జాతీయ నేరస్తుల విడుదలకు డిమాండ్లు పెరుగుతాయని కూడా కేంద్రం అభిప్రాయపడింది. తల్లి ఇందిరా గాంధీని బాడీ గార్డులు కాల్చి చంపిన ఏడు సంవత్సరాల తరువాత మే 21, 1991 రాత్రి ఈలం మద్దతు దారులు తమిళనాడులోని శ్రీపెరంబదూరు వద్ద ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి విచ్చేసిన రాజీవ్ గాంధీని మహిళా మానవ బాంబు ప్రయోగించి హత్యచేసినవిషయం తెలిసిందే.

కాగా, రాజీవ్ హంతకులను విడిచిపెట్టాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా రెండు పేజీల కేంద్ర వాదనలను నమోదు చేసిన న్యాయముర్తులు కేసు విచారణ వాయిదా వేశారు.

 

మామాట: నరహంతకులకు కూడా క్షమాభిక్షా…. రాజకీయమా…. దారుణం

(Visited 9 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: