ఎన్టీఆర్ నుండి రాజర్షి సాంగ్ వచ్చేసింది..(వీడియో)

Share Icons:

హైదరాబాద్, 12 డిసెంబర్:

దివంగత ఎన్టీరామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ త‌న‌యుడు బాలకృష్ణ స్వ‌యంగా నిర్మిస్తుండ‌గా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జనవరి 9న ‘ఎన్టీఆర్-కథానాయకుడుగా’, జనవరి 24న ‘ఎన్టీఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇవి సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ సినిమా నుండి క‌థానాయ‌క అంటూ సాడే పాట విడుద‌ల చేశారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాట అభిమానుల‌ని ఎంత‌గానో అలంచింది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ‌ర్షి అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కి శివ‌ద‌త్తా, కె రామ‌కృష్ణ‌, కీర‌వాణి లిరిక్స్ అందించ‌గా.. శ‌ర‌త్ సంతోష్‌, మోహ‌న భోగ‌రాజు, కీర‌వాణి, క‌ళా భైర‌వ‌, శ్రీనిధి తిరుమల క‌లిసి ఆల‌పించారు. ఈ సాంగ్ కూడా పూర్తి సంస్కృత ప‌దాల‌తో ఉండ‌డం విశేషం.

మామాట: ఆసక్తిని కలిగిస్తున్న ఎన్టీఆర్ సాంగ్స్

Leave a Reply