ఢిల్లీ అల్లర్లు: బీజేపీపై రజనీకాంత్ ఫైర్…

astrologer balaji comments on rajanikanth
Share Icons:

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా సి‌ఏ‌ఏ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో చాలామంది ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే ఈ హింసాత్మక ఘటనలను ఖండించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ఆదివారం పలువురు ముస్లిం మతపెద్దలు రజనీతో భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సూపర్ స్టార్.. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు రజనీ చెప్పారు.

ఇదిలా ఉంటే ఓ వైపు రజనీ కేంద్ర పెద్దలపై ఫైర్ అవుతుంటే..మరోవైపు రజనీతో పొత్తు విషయంపై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్‌తో పొత్తు గురించి బీజేపీ మాజీ కేంద్ర సహయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ స్పందించారు. నటుడు రజనీకాంత్‌ ఇంకా పార్టీని ప్రారంభించలేదు. అయినా ఆయన పెట్టే పార్టీ గురించి, ఏ పార్టీలో పొత్తు అనే విషయాల గురించి చాలా కాలంగానే రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క రజనీ బీజేపీ మద్దతుదారుడనే ముద్ర ఉండనే ఉంది.

ఈ క్రమంలో పొత్తుపై మంత్రి స్పందిస్తూ…ముందు రజనీకాంత్‌ను పార్టీ పెట్టనీయండి అన్నారు. ఆయన పార్టీ జెండా, అజెండా ఏమిటో వెల్లడించాలని, ఆ తరువాత రజనీతో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక నటుడు కమలహాసన్‌ విషయానికి వస్తే ఆయన ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇది సినిమాను నిర్మించడం కాదని, తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమైన అంశం అని అన్నారు. 50 ఏళ్లుగా తమిళనాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా వెనుకపడిపోయిందన్నారు. దాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికలు చాలా కీలకం అన్నారు.

 

Leave a Reply