ఎన్టీఆర్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రాజమౌళి..!

Share Icons:

హైదరాబాద్, 18 మే:

మే 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు ఉన్న విషయం తెలిసిందే.  కానీ హరికృష్ణ మరణించి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలాగే అభిమానులని కూడా ఎలాంటి వేడుకలు చేయొద్దని కోరాడు.

కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ రోజున ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తున్నారు.

మామాట: మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి

Leave a Reply