అమరావతి తత్కాల్ సచివాలయం ఉరుస్తోందట!?

Share Icons:

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం:

“నవనిర్మాణ దీక్ష అంటే ఇదేనా?”

*********

సచివాలయం ఎందుకు ఉరుస్తోంది?…

“సీలింగులోనుంచి నీరు కారుతోంది!

నీరా నీరా ఎందుకు కారుతున్నావ్?

స్లాబు బొటబొటా కన్నీళ్లు కార్చింది!

స్లాబా స్లాబా ఎందుకు కన్నీళ్లు కార్చావ్?

ఇసుక ఎక్కువై కాంక్రీటులో సిమెంటు లేక!

సిమెంటా సిమెంటా ఎందుకు లేకుండా పోయావ్?

కాంట్రాక్టరు అడుగడుగునా కక్కుర్తి పడబట్టి!

కాంట్రాక్టరా కాంట్రాక్టరా ఎందుకు కక్కుర్తి పడ్డావ్?

చినబాబులకు పెదబాబులకు పంపకాలు ఎక్కువై!

బాబులూ బాబులూ ఎందుకు పంపకాలు తీసుకున్నారు?

ఆమాత్రం తెలియదా? రేపు ఓట్లకు నోట్లు కావాలగదా! నువ్వు నీ తిక్క ప్రశ్నలు!!”  -అని బాబులు కసురుకోవడంతో ఎంక్వయిరీ కూడా ముగిసి పోతుందని ముందే వాసన పట్టేసినట్టుంది ప్రతిపక్షం. తమ మీడియాలో క్రింది కథనాన్ని ప్రచురించింది. మీరూ చదవండి-

– కూలిన అసెంబ్లీ, సచివాలయం భవనాల గోడలు.. పైకప్పు లీకేజీ
– చాంబర్లలోకి భారీగా వర్షపు నీరు.. సిబ్బంది ఇక్కట్లు
– 20 నిమిషాల వానకే ‘రాజధాని’ అతలాకుతలం.. భారీ వర్షం కురిస్తే పెనుప్రమాదం!
– మీడియాకు అనుమతి నిరాకరణ.. సర్వత్రా ఆందోళన

అమరావతి:

గట్టిగా 20 నిమిషాలపాటు వర్షం కురిసిందోలేదో.. ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలం అయింది. భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాలను వర్షపు నీరు ముంచెత్తింది. ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉండలేని పరిస్థితిలో కార్మికులు నీళ్లను తోడే ప్రయత్నం చేశారు. తాత్కాలిక అసెంబ్లీలోని ప్రతిపక్షనేత కార్యాలయంలోనైతే ఏకంగా నీరు ధారలా కారిన దృశ్యాలు కనిపించాయి.

ఒక్క వర్షంతో.. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మూటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఐదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు.

చంద్రబాబు ఇల్లు ఇలానే కురుస్తుందా?
అమరావతిలోని తాత్కాలిక భవనాల్లో మంగళవారం కనిపించి దృశ్యాలు చూసి ఆంధ్రదేశం నివ్వెరపోయింది. ఎంత తాత్కాలిక నిర్మాణమైతేమాత్రం మరీ కురవడమేమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘జనం సొమ్ము కాబట్టే అడ్డగోలుగా దోచుకుతిన్నారు.. అరకొరగా నిర్మాణాలు చేశారు.. ఏం? హైదరాబాద్‌లో వందల కోట్లతో కట్టిన చంద్రబాబు ఇల్లు కూడా ఇలానే కురుస్తుందా?’ అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నల్లరేగడి నేలలో నిర్మాణాలు సరికాదని ఎప్పటినుంచో మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవినపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

చదరపు గజానికి రూ.10 వేల ఖర్చు
భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు గజానికి ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.9వేల కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. నిర్మాణాలు తూతూ మంత్రంగా సాగుతుండటంపై గతంలోనే ‘సాక్షి’ అనేక కథనాలు రాసింది. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు.. తాత్కాలిక భవనాల్లోకి మీడియాను అనుమతించకుండా పరుకుకాపాడుకునే వ్యర్థప్రయత్నం చేసింది.

పొంచిన పెనుముప్పు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకముందే.. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా మంగళవారం పలు జిల్లాలల​ఓ వర్షాలు కురిశాయి. సరిగ్గా అరగంట కూడా పడని వర్షానికి తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయ్యాయి. గోడలు విరిగిపడి, పైకప్పునుంచి నీటి ధారలు కారాయి. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి వర్షాలు ప్రారంభంకానుండటంతో రాజధానికి పెనుముప్పు పొంచిఉందనే చెప్పాలి. ఇవాళ్టి బీభత్సం తరువాత.. ‘మున్ముందు.. గంటో, రెండు గంటలో ఏకధాటిగా భారీ వర్షం కురిస్తే.. తాత్కాలిక భవనాలు తట్టుకుంటాయా? అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

– ఇదీ సాక్షి కథనం. ఇక నిజం చంద్రుడెరుగు – నీరు పల్లమెరుగు.

పనిలో పనిగా ఈ విడియోనూ వీక్షించండి.

మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘నాచంబానా’ మరియు వారి సహచరులు నవనిర్మాణ దీక్షలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి నిర్మాణాల కోసమేనా “నవ నిర్మాణ దీక్షలు?” “పునర్నిర్మాణ దీక్షలు?” అని ప్రశ్నల పరంపరైతే పలువురిలో ప్రారంభమైంది.

ఉపసంహారం:- “ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా” అన్న నానుడిని పాలకులూ గమనించాలి. ప్రజలూ గుర్తించాలి. లేకుంటే భవిష్యత్తులోనూ బిల్డింగులు కూలుతున్న దృశ్యాలే సాక్షాత్కరిస్తాయి..

 

14 Comments on “అమరావతి తత్కాల్ సచివాలయం ఉరుస్తోందట!?”

 1. సచివాలయం ఎందుకు ఉరుస్తోంది?…
  “సీలింగులోనుంచి నీరు కారుతోంది!
  నీరా నీరా ఎందుకు కారుతున్నావ్?
  స్లాబు బొటబొటా కన్నీళ్లు కార్చింది!
  స్లాబా స్లాబా ఎందుకు కన్నీళ్లు కార్చావ్?
  ఇసుక ఎక్కువై కాంక్రీటులో సిమెంటు లేక!
  సిమెంటా సిమెంటా ఎందుకు లేకుండా పోయావ్?
  కాంట్రాక్టరు అడుగడుగునా కక్కుర్తి పడబట్టి!
  కాంట్రాక్టరా కాంట్రాక్టరా ఎందుకు కక్కుర్తి పడ్డావ్?
  చినబాబులకు పెదబాబులకు పంపకాలు ఎక్కువై!
  బాబులూ బాబులూ ఎందుకు పంపకాలు తీసుకున్నారు?
  ఆమాత్రం తెలియదా? రేపు ఓట్లకు నోట్లు కావాలగదా! నువ్వు నీ తిక్క ప్రశ్నలు!!” -అని బాబులు కసురుకోవడంతో ఎంక్వయిరీ కూడా ముగిసి పోతుందని ముందే వాసన పట్టేసినట్టుంది ప్రతిపక్షం.
  అబ్బబ్బబ్బా ఈ కథ మాత్రం సూపర్ సార్.

 2. నీరు పల్లమెరుగు..నిజం చంద్రుడెరుగు..

 3. For the rain which lasted for 20 mins has given a devastation look for the Andhra Pradesh Secretariat, administrative office—–Just imagine what would be the situation in the next coming months ——-corruption is at the peak in AP…

 4. ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని అమరావతి

  మీరు మరీ అండి అర్థం చేసుకోరూ అది తాత్కాలికం అని అంటున్నారు కదా… తాత్కాలికం అంటే మరి తాత్కాలిక బాధలు తప్పవు…శాశ్వతంగా మీరే రాజులు అనండి శాశ్వత రాజధాని అమరావతి అని రాసుకోవచ్చు అదే అదే అలా పునర్నిర్మాణం చేస్తారు.

 5. “అంతర్జాతీయ రాజధానికి తొలి చిల్లు. అసెంబ్లీ బీటలు… సచివాలయంలోకి నీళ్లు. ప్రతిపక్షనేత చాంబర్లో కుండపోత. లైట్లనుంటి కారిన నీళ్లు… కూలిన సీలింగ్” ఈమాటలు ఇని ఎల్లోదళాలు కుతకతలాడుతున్నయి. పైగా దీక్షలో వున్నారు.

 6. ముక్కు చీదడం సహజం – స్లాబు ఉరవడం సహజం. దీనికంత రాద్దాంతరం ఎందుకు? పునర్నిర్మాణం చేసుకుంటూ మనం నవనిర్మాణ దీక్షతో ముందుకు పోదాం. ఇదీవరస!! ఏంచేద్దాం? గోదావరి దాటితే భంగాళాఖాతం వుందిగా మనమన్నా అందులో దూకదాం. లేకుంటే వాళ్లనైనా అందులో ముంచుదాం. ఆలోచించండి!! ఆట్టే సమయం లేదు…

 7. దీక్షాదక్షులు ఇవేమీ పట్టించుకోరు. కూలిపోతేకూడా బాధ వుండదు. మళ్లీ శంకుస్థాపనలు చేసి టెండర్లు పిలుస్తారు.

 8. సినిమా సెట్టింగులైనా షూటింగ్ పూర్తయ్యేదాకా నిలబడతాయి. 900 కోట్ల సెట్టింగ్ 90 రోజులకే ఉరవడం విడ్డూరమే.

 9. “ఉపసంహారం:- “ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా” అన్న నానుడిని పాలకులూ గమనించాలి. ప్రజలూ గుర్తించాలి. లేకుంటే భవిష్యత్తులోనూ బిల్డింగులు కూలుతున్న దృశ్యాలే సాక్షాత్కరిస్తాయి..” -అయినా విననిచ్చకుంటే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత.

 10. సచివాలయంలోకి నీళ్లు రావడం. చిరుజల్లుకే రాజధాని జలమయం కావడం. ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న రాజధాని లక్షణాలు. ఎదో మీకు తేలిక ఇలా ఏకసెక్కాలు ఆడుతున్నారుగాని, తెలిస్తే చంద్రబాబు కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకునేవాళ్ళు

  – మహేష్ కత్తి

Leave a Reply