సెమీస్ కు వర్షం ముప్పు….మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?

rain effect in india vs new zealand semis
Share Icons:

లండన్:

 

ప్రపంచ కప్ లో నేడు టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే గ్రూప్ దశలో కొన్ని మ్యాచ్ లకు అడ్డు తగిలిన వరుణ దేవుడు..ఈ సెమీస్ కూడా అడ్డు తగిలేలా కనిపిస్తున్నాడు.

 

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలు కానుంది. అయితే అక్యూవెదర్ అంచనాల ప్రకారం 11 నుంచి 12 గంటల మధ్య జల్లులు పడతాయి. కాసేపటి తర్వాత ఈ జల్లులు ఆగిపోతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది.

 

ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం కురిస్తే… ఆట ఆగిపోతే… మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో, మరుసటి రోజు మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో, న్యూజిలాండ్ శిబిరంలో కలవరం మొదలైంది. ఎందుకంటే… వరుసగా రెండు రోజులు వర్షం వల్ల ఆట కొనసాగకపోతే… టీమిండియాను విజేతగా ప్రకటిస్తారు.

 

ఎందుకంటే లీగ్ దశలో 8 మ్యాచుల్లో టీమిండియా 7 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్ (న్యూజిలాండ్ తో జరిగింది) వర్షం వల్ల రద్దైంది. దీంతో, 15 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఇండియా ఉంది. న్యూజిలాండ్ 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో, లీగ్ దశలో అత్యధిక పాయింట్లు ఉన్న ఇండియాను విజేతగా ప్రకటిస్తారు.

Leave a Reply