TRENDING NOW

ప్రధాని అవినీతికి  పాల్పడ్డారు.. రాహుల్

ప్రధాని అవినీతికి  పాల్పడ్డారు.. రాహుల్
Views:
16

కొత్త ఢిల్లీ, అక్టోబర్ 11,

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని మోదీ పై విరుచుకుపడ్డారు. యుద్ధ విమానాల కొనుగోలు  ఒప్పందంలో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఒప్పందంలో రహస్యంగా ఉంచవలసిన  అంశాలలో విమానం ధర లేనేలేదని తేల్చిచెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆ విషయాన్ని స్వయంగా తనతో చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, రాఫెల్ డీల్ పై  నిజాలను ప్రచురిస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం  కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అప్పటికీ లొంగి రానివారిపై ఐటీ శాఖ ద్వారా దాడులు చేయిస్తోందన్నారు. రక్షణశాఖ విమానాల కొనుగోలులో  అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని, భారీ అవినీతిపరుడిగా తయారయ్యారని  ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. అయితే పదవి చేపటేటిన తరువాత  అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారనీ, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. మోదీ అవినీతికి పాల్పడ్డారనేదానికి గట్టి సాక్ష్యాలున్నాయన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్  గురుతుచేశారు.

రాఫెల్ మాత్రమే కాదు.. మోదీ సారధ్యంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించి వాస్తవాలు త్వరలోనే వెలుగు చూస్తాయని రాహుల్ జోస్యం చెప్పారు. రాఫెల్ ఒప్పందంపై చర్చకు రావాలనీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పారిపోయారని  ఎద్దేవా చేశారు.

మామాట: అవినీతిపై కాంగ్రెస్ పారాడే స్థాయి కల్పించారు మీరు మోదీ జీ

(Visited 29 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: