రాహులొస్తున్నాడు!

Share Icons:

రాహులొస్తున్నాడు!

ఢిల్లీ, జ‌న‌వ‌రి 11

ఏఐసిసి అధ్య‌క్షుడుగా ప‌ద‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాహుల్ గాంధీ పార్టీ ప‌టిష్ట‌త‌కు ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు.

దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీల‌ను ప్రక్షాళ‌న చేసే దిశ‌గా నిర్ణయం తీసుకున్నారు. అందుకు పూర్తి స్థాయి క‌స‌ర‌త్తు కూడా ప్రారంభం అయింది. ముఖ్యంగా యువ‌త‌కు పార్టీలో అన్నింటా ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని రాహుల్ గాంధీ సూచిస్తున్నారు.

డిసెంబ‌ర్ 16న త‌న త‌ల్లి సోనియాగాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడుగా బాధ్య‌త‌లను ఆయ‌న స్వీక‌రించారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా మొత్తం 19 సంవ‌త్స‌రాలు సేవ‌లు అందించారు.

ఎన్నిక‌లు జ‌రిగే చోట్ల‌కు రాహుల్‌

ఇప్పుడు ఆ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన రాహుల్ గాంధీ త్వ‌ర‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈ నెల 15, 16 తేదీలలో ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన అమేథీలో ప‌ర్య‌టించ‌నున్నారు.

పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ వెళ్ల‌లేదు. అందుకే తొలి సారి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి స్వాగ‌తం ప‌లికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స‌న్న‌ద్ధం అవుతున్నాయి.

అమేథీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే క‌ర్నాట‌క త‌దిత‌ర రాష్ట్రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

మామాట: అస‌లుకే మోసం రాకుండా ముందు ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి క‌దా!

English Summery: AICC President Rahul Gandhi is first time going to his own constituency, Amedhi, first time after taking charge as Party President. It is scheduled to reach the constituency on 15th and 16th of this month. After his tour to own constituency, he will tour the states which are due of the assembly polls.

Leave a Reply